Site icon NTV Telugu

Crime News: ఈసీఐఎల్‌లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిపై కొడుకు కత్తితో దాడి

Filmnagar Murder Case

Filmnagar Murder Case

హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్‌ x రోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంతోనే తండ్రిపై కొడుకు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో దాడి చేసిన వ్యక్తి ఉన్నాడు. తండ్రి మొగిలి, కొడుకు సాయి కుమార్‌గా గుర్తించారు. నిత్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పెడుతున్నాడని.. ఆస్తి పంపకాల్లోనూ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో.. కుటుంబ తగాదాలు మొదలయ్యాయి.

Read Also: Iran: టెల్ అవీవ్‌ని నాశనం చేస్తామన్న ఇరాన్.. సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..

ఈ ఘటనపై కుషాయిగూడ ఏసీపీ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తండ్రి కొడుకుల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. లాలాపేట నుండి బస్సులో తండ్రి ఈసీఐఎల్ కు వచ్చాడు.. ఈ క్రమంలో బైక్ పై వెంబడించిన కొడుకు సాయి కుమార్ బస్ స్టాప్లో బస్సు దిగి వస్తున్న తండ్రిపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడన్నారు. 15 సార్లు పొడవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Read Also: Iran: టెల్ అవీవ్‌ని నాశనం చేస్తామన్న ఇరాన్.. సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..

Exit mobile version