NTV Telugu Site icon

Psycho killer: సైకో కిల్లర్ కథ.. స్త్రీలే టార్గెట్.. రక్తం వచ్చేలా దాడి చేస్తాడు.. కుదిరితే చంపేస్తాడు

Psycho Killer

Psycho Killer

యూపీలోని గోరఖ్‌పూర్‌లో పట్టుబడ్డ ‘సైకో కిల్లర్’ అజయ్ నిషాద్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను మహిళలను చాలా ద్వేషిస్తాడని తెలిసింది. స్త్రీలను హింసించడం, వాళ్ల రక్తం వచ్చేలా దాడి చేయడం ద్వారా ఆనందిస్తాడట. వాస్తవానికి.. నిన్న గోరఖ్‌పూర్‌లోని ఝంఘా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అజయ్ నిషాద్‌ను అరెస్టు చేశారు. గత నాలుగు నెలలుగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతూ ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించాడు నిషాద్. ఒకరిద్దరు కాదు ఐదుగురు మహిళలపై కర్రలు/రాడ్లు లేదా పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. అతని దాడిలో ఒక మహిళ కూడా మరణించింది.

స్త్రీలు బాధ పడుతుంటే నాకు నచ్చుతుంది: అజయ్ నిషాద్
ఈ మొత్తం విషయాన్ని గోరఖ్‌పూర్ ఎస్పీ (నార్త్) జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ వెల్లడిస్తూ.. అజయ్ నిషాద్ సీరియల్ కిల్లర్ కాదని.. కేవలం మహిళలను గాయపరిచేవాడు అని అన్నారు. ఈ యువకుడి దాడిలో మహిళ చికిత్స పొందుతూ మరణించిందన్నారు. అయితే.. ఆ ఘటనలు చేసే తీరు చూసి జనాలు అతడిని ‘సీరియల్ కిల్లర్’, ‘సైకో కిల్లర్’ అని పిలుస్తున్నారన్నారు. ” నేను మహిళలపై దాడి చేసినప్పుడు.. వారు నొప్పితో మూలుగుతారు. కేకలు వేస్తూ.. ఏడుస్తారు. స్త్రీల బాధలు, వారి శరీరంలోంచి రక్తం ప్రవహించడం నాకు చాలా నచ్చుతుంది. కుదిరితే వాళ్లని చంపేయాలని పిస్తుంది ” అని నిందితుడు అజయ్ నిషాద్ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. దాడి తర్వాత నిందితుడు తన ప్రియురాలితో కూడా మాట్లాడని పోలీసులు తెలిపారు. ఈ అయిదు ఘటనల్లోనూ దాడి తర్వాత, అతను అర్ధరాత్రి తన ప్రియురాలితో మాట్లాడుతున్నట్లు రికార్డులో కనుగొన్నారు. సంఘటనా స్థలంలో తీరుతూనే మాట్లాడేవాడట.

అజయ్ నిషాద్‌ గురించి సంచలన విషయాలు..
నిందితుడు అజయ్ నిషాద్‌కు ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియురాలు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆమెను కలవడానికి అజయ్ డెహ్రాడూన్ వెళ్లేవాడు. అయితే.. అజయ్ హైస్కూల్ వరకు చదువుకున్నాడు. ఇప్పటికీ ఒంటరిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో పీఓపీని ఇన్‌స్టాల్ చేసేవాడు. గత నవంబర్ 4న ఛత్ పూజ కోసం ఇంటికి వచ్చాడు. అజయ్ శనివారాల్లో నల్లటి దుస్తులు ధరించి నేరం చేసిన తర్వాత పరారీలో ఉండేవాడు. తప్పించుకోవడం తేలికవుతుందని చెప్పులు లేకుండానే నేరం చేసేవాడు. అజయ్ ముందుగా టార్గెట్ నిర్ణయించుకోడు. అతను అర్ధరాత్రి చుట్టూ తిరుగుతూ.. జనసాంద్రతకు దూరంగా ఉన్న ఇళ్ల కోసం వెతుకుతున్నాడు. సులభంగా దూరే ఇంటిని ఎంచుకుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాతే దాడి చేసేవాడు.