Psycho killer: సైకో కిల్లర్ కథ.. స్త్రీలే టార్గెట్.. రక్తం వచ్చేలా దాడి చేస్తాడు.. కుదిరితే చంపేస్తాడు
- యూపీలోని గోరఖ్‌పూర్‌లో పట్టుబడ్డ 'సైకో కిల్లర్'
- అజయ్ నిషాద్ గురించి షాకింగ్ విషయాలు
- కేవలం మహిళలపైనే దాడి
- స్త్రీలను హింసిస్తూ.. సంతోషించే నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని గోరఖ్‌పూర్‌లో పట్టుబడ్డ ‘సైకో కిల్లర్’ అజయ్ నిషాద్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను మహిళలను చాలా ద్వేషిస్తాడని తెలిసింది. స్త్రీలను హింసించడం, వాళ్ల రక్తం వచ్చేలా దాడి చేయడం ద్వారా ఆనందిస్తాడట. వాస్తవానికి.. నిన్న గోరఖ్‌పూర్‌లోని ఝంఘా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అజయ్ నిషాద్‌ను అరెస్టు చేశారు. గత నాలుగు నెలలుగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతూ ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించాడు నిషాద్. ఒకరిద్దరు కాదు ఐదుగురు మహిళలపై కర్రలు/రాడ్లు లేదా పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. అతని దాడిలో ఒక మహిళ కూడా మరణించింది.
స్త్రీలు బాధ పడుతుంటే నాకు నచ్చుతుంది: అజయ్ నిషాద్
ఈ మొత్తం విషయాన్ని గోరఖ్‌పూర్ ఎస్పీ (నార్త్) జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ వెల్లడిస్తూ.. అజయ్ నిషాద్ సీరియల్ కిల్లర్ కాదని.. కేవలం మహిళలను గాయపరిచేవాడు అని అన్నారు. ఈ యువకుడి దాడిలో మహిళ చికిత్స పొందుతూ మరణించిందన్నారు. అయితే.. ఆ ఘటనలు చేసే తీరు చూసి జనాలు అతడిని ‘సీరియల్ కిల్లర్’, ‘సైకో కిల్లర్’ అని పిలుస్తున్నారన్నారు. ” నేను మహిళలపై దాడి చేసినప్పుడు.. వారు నొప్పితో మూలుగుతారు. కేకలు వేస్తూ.. ఏడుస్తారు. స్త్రీల బాధలు, వారి శరీరంలోంచి రక్తం ప్రవహించడం నాకు చాలా నచ్చుతుంది. కుదిరితే వాళ్లని చంపేయాలని పిస్తుంది ” అని నిందితుడు అజయ్ నిషాద్ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. దాడి తర్వాత నిందితుడు తన ప్రియురాలితో కూడా మాట్లాడని పోలీసులు తెలిపారు. ఈ అయిదు ఘటనల్లోనూ దాడి తర్వాత, అతను అర్ధరాత్రి తన ప్రియురాలితో మాట్లాడుతున్నట్లు రికార్డులో కనుగొన్నారు. సంఘటనా స్థలంలో తీరుతూనే మాట్లాడేవాడట.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అజయ్ నిషాద్ గురించి సంచలన విషయాలు..
నిందితుడు అజయ్ నిషాద్‌కు ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియురాలు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆమెను కలవడానికి అజయ్ డెహ్రాడూన్ వెళ్లేవాడు. అయితే.. అజయ్ హైస్కూల్ వరకు చదువుకున్నాడు. ఇప్పటికీ ఒంటరిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో పీఓపీని ఇన్‌స్టాల్ చేసేవాడు. గత నవంబర్ 4న ఛత్ పూజ కోసం ఇంటికి వచ్చాడు. అజయ్ శనివారాల్లో నల్లటి దుస్తులు ధరించి నేరం చేసిన తర్వాత పరారీలో ఉండేవాడు. తప్పించుకోవడం తేలికవుతుందని చెప్పులు లేకుండానే నేరం చేసేవాడు. అజయ్ ముందుగా టార్గెట్ నిర్ణయించుకోడు. అతను అర్ధరాత్రి చుట్టూ తిరుగుతూ.. జనసాంద్రతకు దూరంగా ఉన్న ఇళ్ల కోసం వెతుకుతున్నాడు. సులభంగా దూరే ఇంటిని ఎంచుకుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాతే దాడి చేసేవాడు.
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!