Bike Theft Case: ప్రకాశం జిల్లా పుల్లలచేరువులో ఓ దొంగతనం వెలుగులోకి వచ్చింది.. చూడడానికి చిత్రవిచిత్రంగా ఉంది.. ఒక్క పిన్నీసుతో 11 బైక్ లను చోరీ చేశాడు.. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది.. వేణు అనే యువకుడు చూడడానికి అమయకుడుగా ఉప్పప్పటికి ఈజీ మణికి అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో దేశముదురుగా.. కన్నింగ్, కంత్రి గా అవతారం ఎత్తాడు.. ఆ 20 సంవత్సరాల యువకుడు.. ఒక్క పిన్నీసుతో 11 బైక్ లను చోరీ చేసి చివరికి కటకటాల్లోకి పోయాడు.. పుల్లలచేరువు పట్టణంలో మోటార్ సైకిళ్లను దొంగలించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.. వీళ్ళు చేసిన దొంగతనాలను చుస్తే అచ్చర్యం వేయక మానదు.. ఒక పిన్నీసుతో 11 బైక్ లను దొంగతనం చేశారంటే వీళ్ళ రేంజ్ ఏ విధంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఇలాంటి దొంగతనం ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు..లైవ్ డెమో లో బైక్ లు ఎలా దొంగతనాలు చేస్తాడో బైక్ గొంగ వేణు చూపించాడు.. కట్ చేస్తే.. పోలీసులే షాక్ అయ్యారు..
ప్రకాశంజిల్లా పుల్లలచేరువులో గత నెల 29వ తేది సాయంత్రం సమయంలో లక్ష్మా నాయక్ అనే వాహనదారుడు తన మోటార్ సైకిల్ ని పుల్లలచెరువు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో నిలిపివేశాడు.. తాను పని చూసుకొని ఇంటికి పోదామని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు బైక్ కోసం లక్ష్మనాయక్ వచ్చాడు.. తన బైక్ కనపడకపోయే సరికి చెమటలు పట్టాయి.. ఆందోళనకు గురైన బాధితుడు హుటాహుటిన పుల్లలచెరువు ఎస్సై సంపత్ ను కలిసి తన బైక్ చోరీ అయిన విషయం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసాడు.. ఈ చోరీ పై ఫిర్యాదు స్వీకరించిన పుల్లలచెరువు ఎస్సై సంపత్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. బైక్ దొంగల పై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు దొంగలను వలపట్టి పట్టుకున్నారు.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేష్ పాలెం గ్రామానికి చెందిన చొప్పరపు వేణు, చొప్పరపు సన్నీలను పోలీసులు అరెస్ట్ చేశారు..
అయితే పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగ వేణును ఎలా దొంగతనం చేశావు అంటూ డెమో చూపించు అని పోలీసులు అడిగారు.. లైవ్ డెమోలో బైక్ దొంగ వేణు చూపించిన టెక్నిక్ చూసి పోలీసులే అచ్చర్యం వ్యక్తం చేశారు.. ఒక్క పిన్నీసుతో కేబుల్ లో పెట్టి బైక్ ను స్టార్ట్ చేయడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు.. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.. తెలివి ఎవడబ్బ సొత్తు కదానట్టు.. ఒక పిన్నీసుతో తాళం వేసిఉన్న బైక్ ను స్టార్ట్ చేయడంతో అచ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది.. ఇది చాలా వరకు ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు.. ఈ విధంగా చేస్తే ద్విచక్ర వాహనాల సెక్యూరిటీ ఏంటనే విషయం అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.. అయితే, తీగలాగితే డొంక కదిలినట్టు విచారణలో వీళ్ళు చేసిన చోరీలు మొత్తం బయటపడ్డాయి.. ఇక్కడ ఒక బైక్ దొంగతనం చేస్తే ఇతర పోలీస్ స్టేషన్ ల పరిధి మరో 10 మోటార్ సైకిళ్లు దొంగతనం చేశారని విచారణలో తేలింది.. చోరీ చేసిన 11 మోటార్ సైకిల్ ల విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో వివరించారు.. బైక్ ల విషయంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.. బయట ఎక్కడ పడితే అక్కడ బైక్ లు పెట్టవద్దని చెప్తున్నారు.. బైక్‌కు ఎలక్ట్రానిక్ లాక్‌లు, అలారాలు ఉపయోగించాలని ఇది దొంగలను నిరోధించడంలో సహాయపడుతుందని పోలీసులు సూచించారు..