NTV Telugu Site icon

MP Fraud: సరికొత్త మోసం.. వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన కేటుగాళ్లు

Mpfraud

Mpfraud

రోజురోజుకి సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలకు కళ్లెం వేస్తున్నా.. ఇంకోవైపు సైబర్ నేరగాళ్లు కూడా సరికొత్త వ్యూహాలతో ఖాకీలకే సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ పేరుతో బంధువుల్ని బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన జబల్‌పూర్‌‌లో జరిగింది.

ఇది కూడా చదవండి: Bangladesh Violence: షేక్ హసీనా రాజీనామా తర్వాత 232 మంది మృతి..

సైబర్ నేరగాళ్లు ఉజ్జెకిస్థాన్‌లో రిజిస్టర్ అయిన నెంబర్‌తో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కలెక్టర్ పేరు దీపక్ సక్సేనా, వాట్సాప్ డీపీలో ఆయన ఫొటో పెట్టి అతని బంధువుల నుంచి రూ.25 వేలు కాజేశారు. వాట్సాప్‌లో కలెక్టర్ దీపక్ సక్సేనా పేరు, డిస్‌ప్లే పిక్చర్ (డీపీ)ని ఉపయోగించి నేరగాళ్లు అతని కుటుంబం, బంధువుల నుంచి నగదు కాజేసందుకు ఫ్లాన్ వేశారు. దీంతో ఫోన్ కాల్స్, మరియు టెస్ట్ మెసేజ్‌లతో మోసానికి పాల్పడ్డారు. ఈ విధంగా తనకు అర్జెంట్‌గా రూ.25 వేలు పంపాలని కలెకర్ట్ బంధువుకు సందేశం పంపగా.. వెంటనే అతడు రూ.25 వేలు పంపించాడు. దీంతో తన పేరుతో మోసం జరుగుతుందన్న విషయాన్ని ఆలస్యంగా గమనించిన కలెక్టర్ దీపక్ సక్సేనా.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Nagarjuna: శోభితా ధూళిపాళ చాలా హాట్‌గా ఉంది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్

Show comments