Site icon NTV Telugu

Saidabad Case : సైదాబాద్ జువైనల్ హోంలో మరో లైంగిక దాడి వెలుగులోకి

Boy Harassment

Boy Harassment

Saidabad Case : హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్ జువైనల్ హోంలో మళ్లీ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఒక బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న సూపర్‌వైజర్ రెహమాన్ (27) పై మరోసారి కొత్త కేసు నమోదైంది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. తాజా కేసు వివరాల ప్రకారం… జువైనల్ హోంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రెహమాన్ రాత్రి వేళల్లో బాలుడిని నిద్రలేపి బలవంతంగా బాత్రూమ్‌కు తీసుకెళ్లి, బట్టలు విప్పించి, తన ఇష్టానికి విరుద్ధంగా అసహజమైన, అసభ్యకరమైన లైంగిక చర్యలకు పాల్పడేవాడని బాలుడు తల్లికి తెలిపాడు. అంతేకాక, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించేవాడని బాధితుడు వివరించాడు.

Mithramandali : అలాంటి వాళ్లంతా పిచ్చోళ్లే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్

రెహమాన్ మాట వినకపోతే తన చేతులు కట్టేసీ, ఇనుప స్కేల్‌తో కొట్టేవాడని కూడా బాలుడు వెల్లడించాడు. ఈ ఘటనలన్నింటినీ భయంతో ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేకపోయాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇకపై హోంలో ఉండటానికి ఇష్టపడటం లేదని, తనను ఇంటికి తీసుకెళ్లాలని తల్లిని అభ్యర్థించడంతో విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో సైదాబాద్ పోలీసులు నిందితుడు రెహమాన్‌ను అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

Bihar Elections: బీజేపీ రెండో లిస్ట్ రిలీజ్.. మైథిలి ఠాకూర్ పోటీ చేసేది ఇక్కడి నుంచే..

Exit mobile version