Sahasra M*rder Case : మిషన్ డాన్.. లెటర్ రాసుకుని.. గొంతులో పొడిచి.. పొడిచి..
- పక్కింట్లో దొంగతనం కోసం చేసిన ప్రణాళిక బయటపడింది
- ‘మిషన్ డాన్’ పేరుతో రాసిన లేఖ పోలీసులకు దొరికింది
- సహస్ర హత్యలో పదో తరగతి విద్యార్థి పాత్రకు నిర్ధారణ
- బాలుడి ఇంటి నుంచి రక్తపు మరకలతో దుస్తులు, కత్తి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sahasra M*rder Case : హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ఛేదనలో పోలీసులు కీలక ఆధారాలను వెలికి తీశారు. హత్య నిందితుడు, 10వ తరగతి విద్యార్థి తన దొంగతనం ప్లాన్‌ను “మిషన్ డాన్” పేరుతో రాసుకోవడం విచారణలో బయటపడింది. సహస్ర ఇంట్లోకి ప్రవేశించడం, దొంగతనం చేయడం, ఆపై తప్పించుకోవడం వరకు అన్నీ చీటీలో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వచ్చిన ఇంగ్లీషులో రాసిన ఆ లేఖలో, సహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళానని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని అధికారులు వెల్లడించారు.
Chiranjeevi : ది బ్లడీ బెంచ్‌మార్క్ ట్యాగ్ తో బాబీ నుండి ‘#Mega158’ అప్డేట్..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
హత్య జరిగిన రోజు కూడా బాలుడు పోలీసుల ముందుకు వచ్చి కథలు చెప్పాడు. “సహస్ర ఇంట్లోంచి నాన్నా.. నాన్నా అని అరుపులు వినిపించాయి” అని చెప్పిన బాలుడు, మరొకరు హత్య చేసినట్లుగా అనుమానాలు కలిగించాడు. దీని ఆధారంగా మొదట విచారణను ఇతర కోణాల్లో కొనసాగించిన పోలీసులు, తరువాత మలుపు తిప్పారు. ఈ రోజు ఉదయం మరోసారి ఆధారాలు సేకరించడానికి ఎస్ఓటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్క భవనం నుంచి సులభంగా సహస్ర ఇంట్లోకి దూకవచ్చని గుర్తించారు. దీంతో పక్క భవన నివాసులందరినీ ప్రశ్నించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక సాక్ష్యాలు ఇచ్చాడు. హత్య రోజు తన గది పక్కనే బాలుడు 15 నిమిషాలు దాక్కొని ఉన్నాడని, ముఖం గుర్తుపడుతానని చెప్పడంతో పోలీసులు అనుమానాలు బలపడ్డాయి.
అనుమానాలపై స్కూల్‌కు వెళ్లిన ఎస్వోటీ పోలీసులు బాలుడిని పక్కకు పిలిచి ప్రశ్నించారు. మొదట తనకు సంబంధం లేదని, హత్య చేయలేదని తప్పుదారి పట్టించాడు. అనంతరం బాలుడు ఇంటికి తీసుకెళ్ళి తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో రక్తంతో తడిసిన దుస్తులు, కత్తి, అలాగే “మిషన్ డాన్” పేరుతో రాసుకున్న చీటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా OTTలో చూసిన సిరీస్ ప్రభావంతో హత్య, దొంగతనం, ఎస్కేప్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిసింది. హత్యకు రెండు రోజుల ముందే కాగితం మీద పూర్తి “ప్లాన్ ఆఫ్ యాక్షన్” రాసుకున్న బాలుడు, గ్యాస్ లీక్ చేసి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఛేదనలో SOT, కూకట్పల్లి పోలీసులు కలిసి 300 మందిని విచారించారు. దీంతో సహస్ర హత్యకు బాలుడే బాధ్యుడని పోలీసులు తేల్చారు. దొంగతనం కోసం ప్రణాళిక వేసి, సహస్రను అడ్డం వచ్చినందుకు హత్య చేసినట్లు నిర్ధారించారు.
Maoists kill villager: మావోల ఘాతుకం.. జాతీయ జెండాను ఎగురవేసినందుకేనా..
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!