Site icon NTV Telugu

Sahasra M*rder Case : మిషన్ డాన్.. లెటర్ రాసుకుని.. గొంతులో పొడిచి.. పొడిచి..

Sahasra Kukatpally

Sahasra Kukatpally

Sahasra M*rder Case : హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ఛేదనలో పోలీసులు కీలక ఆధారాలను వెలికి తీశారు. హత్య నిందితుడు, 10వ తరగతి విద్యార్థి తన దొంగతనం ప్లాన్‌ను “మిషన్ డాన్” పేరుతో రాసుకోవడం విచారణలో బయటపడింది. సహస్ర ఇంట్లోకి ప్రవేశించడం, దొంగతనం చేయడం, ఆపై తప్పించుకోవడం వరకు అన్నీ చీటీలో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వచ్చిన ఇంగ్లీషులో రాసిన ఆ లేఖలో, సహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళానని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని అధికారులు వెల్లడించారు.

Chiranjeevi : ది బ్లడీ బెంచ్‌మార్క్ ట్యాగ్ తో బాబీ నుండి ‘#Mega158’ అప్డేట్‌..

హత్య జరిగిన రోజు కూడా బాలుడు పోలీసుల ముందుకు వచ్చి కథలు చెప్పాడు. “సహస్ర ఇంట్లోంచి నాన్నా.. నాన్నా అని అరుపులు వినిపించాయి” అని చెప్పిన బాలుడు, మరొకరు హత్య చేసినట్లుగా అనుమానాలు కలిగించాడు. దీని ఆధారంగా మొదట విచారణను ఇతర కోణాల్లో కొనసాగించిన పోలీసులు, తరువాత మలుపు తిప్పారు. ఈ రోజు ఉదయం మరోసారి ఆధారాలు సేకరించడానికి ఎస్ఓటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్క భవనం నుంచి సులభంగా సహస్ర ఇంట్లోకి దూకవచ్చని గుర్తించారు. దీంతో పక్క భవన నివాసులందరినీ ప్రశ్నించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక సాక్ష్యాలు ఇచ్చాడు. హత్య రోజు తన గది పక్కనే బాలుడు 15 నిమిషాలు దాక్కొని ఉన్నాడని, ముఖం గుర్తుపడుతానని చెప్పడంతో పోలీసులు అనుమానాలు బలపడ్డాయి.

అనుమానాలపై స్కూల్‌కు వెళ్లిన ఎస్వోటీ పోలీసులు బాలుడిని పక్కకు పిలిచి ప్రశ్నించారు. మొదట తనకు సంబంధం లేదని, హత్య చేయలేదని తప్పుదారి పట్టించాడు. అనంతరం బాలుడు ఇంటికి తీసుకెళ్ళి తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో రక్తంతో తడిసిన దుస్తులు, కత్తి, అలాగే “మిషన్ డాన్” పేరుతో రాసుకున్న చీటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా OTTలో చూసిన సిరీస్ ప్రభావంతో హత్య, దొంగతనం, ఎస్కేప్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిసింది. హత్యకు రెండు రోజుల ముందే కాగితం మీద పూర్తి “ప్లాన్ ఆఫ్ యాక్షన్” రాసుకున్న బాలుడు, గ్యాస్ లీక్ చేసి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఛేదనలో SOT, కూకట్‌పల్లి పోలీసులు కలిసి 300 మందిని విచారించారు. దీంతో సహస్ర హత్యకు బాలుడే బాధ్యుడని పోలీసులు తేల్చారు. దొంగతనం కోసం ప్రణాళిక వేసి, సహస్రను అడ్డం వచ్చినందుకు హత్య చేసినట్లు నిర్ధారించారు.

Maoists kill villager: మావోల ఘాతుకం.. జాతీయ జెండాను ఎగురవేసినందుకేనా..

Exit mobile version