Site icon NTV Telugu

Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్

Sahasra Case

Sahasra Case

Sahasra M*rder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన 10 ఏళ్ల సహస్ర హత్య కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో పదో తరగతి చదువుతున్న బాలుడు హంతకుడిగా తేల్చిన పోలీసులు.. బ్యాట్‌ కోసం వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అయితే.. ఇప్పటికే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. తమ బంధువులతో కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసనకు దిగారు. సహస్ర ఫోటోతో ఉన్న ఫ్లెక్సీతో రోడ్డుపై బైఠాయించి We want justice అంటూ నినాదాలు చేశారు.

Govinda Divorce : గోవిందా విడాకుల రూమర్స్‌పై క్లారిటీ..

దీంతో కూకట్‌పల్లి రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సహస్ర పేరెంట్స్‌తో పాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అల్లారుముద్దగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లే దుస్థితి వచ్చిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు సహస్ర తల్లిదండ్రులు. బ్యాట్‌ దొంగతనానికి వచ్చి హత్య చేశాడంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకి న్యాయం జరిగేంత వరకు రోడ్డుపైనే ఆందోళన చేస్తామని సహస్ర పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kantara Prequel : తెలుగు స్టేట్స్‌లో ‘కాంతార ప్రీక్వెల్’కు కోట్ల డీల్ టాక్ – అంత రిస్క్ అవసరమా?

Exit mobile version