Crime News: ఇంట్లో శవంగా మహిళ.. పెంచుకున్న పిల్లులే పీక్కుతిన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చాలామంది ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో మనుషులానే ప్రేమగా సాకుతుంటారు. అవి ఎంత అల్లరి చేసినా వారికి ముద్దుగానే ఉంటాయి. ఇక యజమానులపై పెట్స్ కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. యజమానికి ఏదైనా ఆపద వస్తే వారిని కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణాలు తీయడానికి అయినా అవి వెనుకాడవు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చాలానే చూసాం. కానీ.. ఎంత కాదు అనుకున్నా అవి జంతువులు అనేది కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వార్త కూడా అలాంటిదే.
వివరాల్లోకి వెళితే.. రష్యాలోని రోస్టోవ్ లో ఒక మహిళ(55) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆమె పిల్లులను పెంచుతోంది. ప్రస్తుతం ఆమె వద్ద 20 పిల్లులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా వాటి కోసం రాత్రి కల్లా ఇంటికి వచ్చేసేది. మూడు పూటలా వాటికి నచ్చిన ఆహారం వండి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఒక వారం క్రితం ఒక్కసారిగా ఆమె కుప్పకూలి పడిపోయింది. చూసేవాళ్లు లేరు.. అడిగేవాళ్లు అస్సలు లేరు. దీంతో ఆమె మృతి చెందింది అన్న విషయం కూడా బయట ఎవరికి తెలియదు. ఇలా వారం గడిచింది. ఇంట్లో ఉన్న 20 పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి.
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ఇక ఆహరం లేక ఆ పిల్లులు ఇప్పటివరకు తమను సాకిన యజమాని అని కూడా లేకుండా ఆమెను పీక్కుతినడం మొదలుపెట్టాయి. అలా మహిళ శరీరాన్ని కొంచెం కొంచెం లాగుతూ చర్మాన్ని తింటూ కడుపు నింపుకున్నాయి. ఇక చివరికి వారం తరువాత ఇంటి పక్కన ఉన్నవారికి మహిళ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. పిల్లులు మహిళ శవంపై పడి పీక్కుతింటున్న దృశ్యం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లులు తినగా మిగిలిన బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!