NTV Telugu Site icon

Suicide: పని భారం భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Suicide

Suicide

పని భారం, అధికారుల వేధింపులు భరించలేక ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోను ద్వారా స్వామికి సమాచారం అందిస్తున్నారు. విధులకు రాకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని అధికారులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతూ విధులకు హాజరు కాలేక తీవ్ర మనోవేదన చెందిన స్వామిగౌడ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిక్ లీవ్ ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని.. దీంతో పాటు పని భారం వల్ల  ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని సూసైడ్ నోట్ రాసి స్వామి గౌడ్ ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ మేరకు భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య శిరీష, ఇద్దరు కొడుకులు ఉన్నారు.