ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బిచానా ఎత్తేసిన కేటుగాళ్లను ఎంతో మందిని చూశాం.. ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను బుట్టలో వేసుకుని.. ఇప్పటికీ డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు.. ప్రజలు ఇన్వెస్ట్‌చేసి మోసపోతూనే ఉన్నారు… అయినవాళ్లు అడిగితే అప్పు కూడా ఇవ్వరు.. కానీ, ఆశో.. అత్యాశో.. వారిని ఇలా మోసగాళ్ల చేతుల్లో మాత్రం సులువుగా చిక్కుకునేలా చేస్తుంది.. ఒక్కరు పెట్టిదే.. వేలల్లో.. లేదా లక్షల్లో ఉండొచ్చు.. కానీ, అది మొత్తం ఒక దగ్గర చేరిన తర్వాత వందల కోట్లు.. వేల కోట్లు కూడా ఉంటుంది.. తాజాగా హైదరాబాద్‌లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వెలుగుచూసింది… దేశవ్యాప్తంగా ఏకంగా 600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు.
Read Also: Nandamuri Balakrishna: బ్రేకింగ్ న్యూస్.. బాలకృష్ణకు రెండో ఫ్యామిలీ.. చంద్రబాబు ముందే బట్టబయలు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి.. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు.. ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది… ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. అందులో నలుగురు చైనా దేశస్తులు ఉండగా.. ఐదుగురు ఢిల్లీకి చెందినవారున్నారు.. ఇక, హైదరాబాద్‌కు చెందినవాళ్లు ముగ్గురు ఉన్నారు.. 9 మందిని ఢిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు.. మరో ముగ్గురుని హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేశారు.. మొత్తంగా దేశవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసినట్టుగా గుర్తించారు.. 12 మందిని రిమాండ్ కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు.. అయితే, సైబర్ నేరగాళ్ల నుంచే కాదు.. ఇలా ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మీ వద్దకు వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కలిపించే ప్రయత్నం చేస్తున్నా.. గుట్టు చప్పుడు కాకుండా.. తమ పనిచేసుకుని పోతూనే ఉన్నారు కేటుగాళ్లు..