Vizag Crime: వాళ్లు ఇద్దరు రౌడీషీటర్లు… అసలై మందు వేశారు.. ఆపై అమ్మాయి విషయంలో ఘర్షణ.. దీంతో, పరస్పరం దాడులు.. చివరకు ఒకరి ప్రాణాలు కూడా పోయాయి.. విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది… మద్యం మత్తులో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ.. ఓ రౌడీషీటర్ హత్యకు దారి తీసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7వ తేదీన కోర్టు వాయిదాకు విశాఖపట్నం వచ్చారు రౌడీ షీటర్ కసింకోట శ్రీధర్ బాబు(33), ఎలమంచిలికి చెందిన రౌడీషీటర్ గౌరీ శంకర్ (38).. కోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి సీతమ్మధారలో ఓ ఇంట్లో బస చేసారు.. ఫుల్లుగా మద్యం తాగి ఓ యువత కోసం గొడవపడ్డారు.. శ్రీధర్ బాబుపై గౌరీ శంకర్ కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు..
Read Also: MLA పేరు చెప్పి 20 కోట్లు కాజేసిన కిలాడీ లేడి అరెస్ట్ !
ఇక, తీవ్రంగా గాయపడిన శ్రీధర్ బాబు కాళ్లు, చేతులు కట్టేసి కారులో ఎలమంచిలి తీసుకెళ్లాడు… మర్రిబంధ వద్ద గల పోలవరం కాలువలో విసిరేశాడు.. ఇక, తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా వెళ్లిపోయాడు. అయితే, రెండు రోజులైనా శ్రీధర్ బాబు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలవరం కాలువలో మృతదేహం తేలడంతో అక్కడకు చేరుకొని మృతదేహం శ్రీధర్ బాబుగా గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు… ఓ కేసు విషయంలో రౌడీషీటర్ గౌరీ శంకర్‌ను విచారించగా శ్రీధర్‌బాబు హత్య వ్యవహారం వెలుగు చూసింది.. నిందితుడు గౌరీ శంకర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు.
