Digital Arrest: అనంతపురంలో డిజిటల్ అరెస్టు పేరున డబ్బు డిమాండ్ చేసిన సైబర్ కేటుగాడిని రిటైర్డ్ ఉద్యోగి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఫోన్ చేసింది డిజిటల్ మోసగాడు అని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డి నేరుగా అనంతపురం టు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.. దీంతో డిజిటల్ నెరస్తుడి నుంచి తప్పించుకున్నాడు. ధైర్యంగా ఎదుర్కొన్న నారాయణ రెడ్డిని అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్, సైబర్ క్రైం సీఐ జాకీర్ లు అభినందించారు..
Read Also: US: జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ప్రముఖులు గుసగుసలు, నవ్వులు.. వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నీవు క్రిమినల్ కేసులో ఇరుక్కున్నావని నిన్ను తప్పించాలంటే రూ. 30 లక్షలు డబ్బు ఇవ్వాలంటూ సైబర్ నేరగాడు అనంతపురానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణరెడ్డికి రెండ్రోజుల నుండి ఫోన్ చేస్తున్నాడు. డిజిటల్ మోసం అని గ్రహించిన నారాయణ రెడ్డి ఎక్కడతా తగ్గలేదు.. ఇదంతా డబ్బు కాజేయడానికి సైబర్ నేరగాడే తనను బెదిరిస్తున్నట్లు నారాయణ రెడ్డి గుర్తించాడు. డిజిటల్ అరెస్టుపై అవగాహన కల్గిన నారాయణరెడ్డి ఆలస్యం చేయకుండా అనంతపురం పోలీసులను సంప్రదించాడు. అవతలి నుండి రూ. 30 లక్షల కోసం తరుచూ ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాడితో సీఐ శ్రీకాంత్ మాట్లాడారు. నీవు సైబర్ నేరగాడివని, ప్రజల్ని ఇలా సైబర్ ఫ్రాడ్స్ కు గురి చేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని సీఐ మాట్లాడటంతో అవతల సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇలాంటి కేటుగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు..