POCSO Court: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజీవ జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును పోక్సో కోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ వెలువరించారు.. మేజిస్ట్రేట్ తీర్పులో, టీసీలు మరియు రైల్వే సిబ్బందికి నిర్లక్ష్యానికి కారణమై ఘటన జరిగిందని పేర్కొని, వారి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు 2019లో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళుతున్న సమయంలో రాజంపేట-నందలూరు మధ్య చోటు చేసుకున్నది. బాలిక వాష్‌రూమ్‌కు వెళ్ళినప్పుడు నిందితుడు రాంప్రసాద్ రెడ్డి దాడి చేశాడు. ఇటీవల, బాధిత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో గుంతకల్ ఆర్‌ఎం కార్యాలయం కడపకు కేసును రెఫర్ చేసింది. తర్వాత, కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందుకు అనుగుణంగా, పోక్సో కోర్టు బాధిత యువతికి రూ.10,50,000 రూపాయల పరిహారం అందించాలని గుంతకల్ ఆర్‌ఎమ్‌కు ఆదేశాలు జారీ చేసింది. మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: HMDA Land Auction: కోకాపేట భూములకు ముగిసిన మూడో విడత వేలం.. ఎకరం రూ. 131 కోట్లు