NTV Telugu Site icon

Rave Party: తూర్పు గోదావరిలో రేవ్ పార్టీ కలకలం.. ఐదుగురు యువతుల సహా…

Rave Party

Rave Party

Rave Party: న్యూఇయర్‌ సమీపిస్తున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది.. కోరుకొండ మండలం బూరుపూడి గేటు దగ్గర ఉన్న నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు.. జిల్లా ఎస్పీకి వచ్చిన చమచారంతో పోలీసు ప్రత్యేక బృందాలు నాగసాయి పంక్షన్ హాల్‌లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ ఫెస్టిలైజర్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ పార్టీ ఏర్పాటు చేసికున్నట్టు విచారణలో తేలిందంటున్నారు పోలీసులు.. అయితే, మొత్తంగా 19 మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. వీరిలో ఐదుగురు మహిళలతోపాటు మరో 14 మంది పురుషులు ఉన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మహిళలు రాజమండ్రి, కాకినాడ, రంపచోడవరం పరిసర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.. ఇక, పట్టుబడిన పురుషులు గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రికి చెందిన వారిగా చెబుతున్నారు.. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని.. ఇదే సమయంలో రేవ్‌ పార్టీ నిర్వహణకు అనుమతించిన ఫంక్షన్ హాల్ యజమానిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.. కోరుకొండ సీఐ సత్య కిషోర్..

Read Also: Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు!

Show comments