Site icon NTV Telugu

ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు

ACB Raids

ACB Raids

ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.

శ్రీనివాసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు తెలిసిన ఆదాయ వనరుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆస్తులు ఉండటంతో ఏసీబీ అప్రమత్తమైంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, డిసెంబర్ 4న శ్రీనివాసులు నివాసంతో పాటు ఆయన బంధువులు, మిత్రులు, బినామీలకు చెందిన ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

Jupally Krishna Rao : కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏం చేయోచ్చో.. రెండేళ్ల‌లో చేసి చూపించాం

ఈ దాడుల్లో పలు కీలక ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్, నారాయణపేటలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా రైస్ మిల్లు ఉన్నట్లు గుర్తించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో మరో 11 ఎకరాల భూమి, మహబూబ్ నగర్‌లో 4 ప్లాట్లు, మరియు నారాయణపేటలో 3 ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

ఆస్తులతో పాటు, ఏసీబీ అధికారులు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇంకా, కియా సెల్టోస్ హైక్రాస్ కారు, ఇన్నోవా కారు వంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ఆస్తులన్నీ పత్రాల్లో చూపిన విలువ కంటే మార్కెట్ ధర ప్రకారం చాలా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Deputy CM Pawan Kalyan: సంతోషంగా ఉంది.. చిత్తూరు జిల్లా అధికారులను పవన్‌ కల్యాణ్‌ అభినందనలు..

Exit mobile version