Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలోని టాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్ నగర్ వద్ద ఒక యువకుడి మృతదేహం కనిపించింది. మోటార్ సైకిల్ ప్రమాదంలో చనిపోయాడని అంతా భావించారు. ఈ ఘటన మార్చి 13 రాత్రి జరిగింది. అయితే, పోలీసులు మృతుడి ముఖం, గొంతుపై గాయాలు చూడటంతో పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూశారు. రిపోర్టులో గొంతు నులిమి చంపినట్లు తేలింది.
Read Also: Stock Market: 2 రోజుల లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్
ఈ హత్యపై విచారణ ప్రారంభించిన పోలీసులు సంచలన విషయాలు తెలిశాయి. తన అత్త మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న మేనల్లుడే తన మామను చంపినట్లు తేలింది. మృతుడిని మేనల్లుడు వీరేంద్ర, అతడి సహచరుడు జితేంద్ర చంపినట్లు తేలింది. నిందితుడైన వీరేంద్ర, తన అత్తపై వన్ సైడ్ ప్రేమ పెంచుకున్నాడు. మేనమామను అడ్డు తొలగించుకుంటే తనకు మార్గం సుగమం అవుతుందని భావించి హత్యకు పాల్పడ్డాడు.
సినీ ఫక్కీలో హత్యకు ప్లాన్ చేసినట్లు రాంపూర్ ఎఎస్పీ అనురాగ్ సింగ్ చెప్పారు. నిందితుడు వీరేంద్ర, తన మేనమామను పొలానికి రప్పించి, అక్కడే ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులో మునిగిపోయిన తర్వాత మఫ్లర్ ఉపయోగించి మొడకు ఉచ్చు బిగించి హత్య చేశారు. హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
