Site icon NTV Telugu

Affair: అమానుషం.. పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అర్ధనగ్నంగా యువతి ఊరేగింపు..

Rajasthan

Rajasthan

Affair: రాజస్థాన్ రాష్ట్రంలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ, ఓ యువతిని అర్ధనగ్నంగా ఊరేగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో ఓ పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారని పోలీసులు ఆదివారం తెలిపారు.

Read Also: Iron Dome-Arrow System: ఇరాన్ దాడిని తిప్పికొట్టిన ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలు ఇవే.. ఎలా పనిచేశాయంటే.?

సర్వాది అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యక్తికి మహిళతో ఉన్న సంబంధం ఉందని భార్య, అతని పిల్లలు గుర్తించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బాధితురాలని అర్ధనగ్నంగా జట్టు పట్టుకుని ఊరేగించినట్లు కనిపిస్తోంది. సమ్‌దారి పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. బాధితురాలకి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ఈ ఘటనలో ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Exit mobile version