NTV Telugu Site icon

Rajasthan :మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. కట్ చేస్తే.. శవమైంది..

Efir

Efir

ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువ అయ్యాయి.. అంతేకాదు చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. తాజాగా మరో మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలను కోల్పోయింది.. తనకన్నా ఎనిమిదేళ్ల చిన్నవాడైనా మరిది వరుస అయ్యే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది.. అతన్ని వదల్లేక పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. కానీ చివరికి అనుకోకుండా శవమై తేలింది..

వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్‌ అనే మహిళ హత్యకు గురైంది. మే 23వ తేదీన ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన మైనా కన్వర్.. మరుసటి రోజు రోడ్డు పక్క పొదల్లో శవమై కనిపించింది..ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనాను అక్కడే హత్య చేసినట్టుగా గుర్తించారు…

ఆమె శవం పక్కన బైక్ వచ్చిన గుర్తులు ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు..కాల్ డేటా వివరాలను పోలీసులు బయటకు తీశారు. అయితే అందులో ఆమె మే 23వ తేదీ రాత్రి ఫోన్ మాట్లాడినట్టుగా గుర్తించారు.. తనకు మరిది అయ్యే దీపక్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని తేలింది.. అయితే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చెయ్యడంతో చంపేసినట్లు అతను నేరం ఒప్పుకున్నాడు.. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

Show comments