Techie Suicide: మహారాష్ట్ర పూణేలో 33 ఏళ్ల ఐటీ ఉద్యోగిని త్రిష్ణా రాహుల్ సక్ఫాల్ ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు భరించలేక తన కూతురు చనిపోయినట్లు ఆమె తండ్రి ఆరోపించారు. భర్త, అత్తమామల వరకట్న వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిష్ణా జీతం మొత్తం అత్తింటిలో ఇవ్వాలని, పుట్టింటి వారు ఇచ్చి ఫ్లాన్‌ను అత్త పేరు మీదకు మార్చాలని, మామ కోసం రూ. కోటి విలువైన ఫ్లాట్ కొనాలసి ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
త్రిష్ణాకు 2018లో రాహుల్ సక్ఫాల్‌తో వివాహమైంది. పెళ్లైన తర్వాత తన కూతురు సంపాదన మొత్తాన్ని భర్త కుటుంవబానికి అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు తండ్రి బాలకృష్ణ ఆరోపించారు. శారీరక, మానసిక వేధింపుల కారణంగా త్రిష్ణా 2021లో పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలోనే మరో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె భర్త విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడని, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో సెప్టెంబర్ 29న త్రిష్ణా ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
పుణె టెకీ ఆత్మహత్య, అత్తమామలు తన జీతం, ఫ్లాట్లు కావాలని కోరారని ఆరోపణ.తన జీతం మొత్తం అప్పగించాలని, పుట్టింటిలోని ఫ్లాట్‌ను అత్తగారి పేరు మీదకు బదిలీ చేయాలని, అలాగే మామగారికి కోటి రూపాయల విలువైన ఫ్లాట్ కొనివ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారని ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులకు లభించిన ఆత్మహత్య లేఖలో, ఆమె తన మరణానికి తన భర్త, అత్తగారు వైశాలి, మామగారు సంజయ్, ఆడపడుచు శైలి, మామగారి తల్లి శకుంతల సలుంకేలను బాధ్యులుగా పేర్కొంది. దీనిపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

