NTV Telugu Site icon

Mumbai: ముంబైలో దారుణం.. పాఠశాల గదిలో బాలికపై టీచర్ అత్యాచారం

Mumbairape

Mumbairape

ముంబైలో దారుణం జరిగింది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన గురువులే అకృత్యాలకు తెగబడుతున్నారు. స్కూల్‌లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికపై పీటీ టీచర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 27న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను బెదిరించడంతో ఇన్ని రోజులకు బయటపడింది.

ఇది కూడా చదవండి: Goli Shyamala: 52 ఏళ్ల వయసులో 150 కి.మీ. ఈదిన మహిళ.. ఏకంగా విశాఖ నుంచి కాకినాడ వరకు..

ముంబైలోని దాదర్‌ పాఠశాల గదిలో బాలిక ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన పీటీ టీచర్(38).. గది తలుపువేసి కౌగిలించకున్నాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. అయితే బాలిక భయంతో ఎవరికీ చెప్పలేదు. అయితే స్నేహితురాలికి తెలియజేయగా.. ఆమె క్లాస్ టీచర్‌కు సమాచారం ఇచ్చింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యయుడితో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. అమ్మాయి తరగతి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు చూసి.. పీటీ టీచర్ అత్యాచారం చేసినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఇదిలా ఉంటే పీటీ టీచర్ ఏడేళ్లుగా స్కూల్‌లో పని చేస్తున్నాడు. ఇలాంటి అకృత్యాలకు ఇంకెన్ని పాల్పడ్డోడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఇతర బాలికలను కూడా వేధించిన సందర్భాలు ఉన్నాయేమోని పరిశీలిస్తున్నారు. నిందితుడిని కస్టడీ కోరతామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: 6th-generation fighter Jets: ఇండియా ముందు రెండు భారీ ఆఫర్లు.. ఇక చైనా, పాకిస్తాన్‌కి చుక్కలే..

Show comments