Site icon NTV Telugu

Vizag Crime: 6 నెలల గర్భవతి, భర్త అనుమానాస్పద మృతి..!

Crime

Crime

Vizag Crime: విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. గర్భవతి అయిన భార్య.. ఆమె భర్త ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టించింది.. పెళ్లయి 6 నెలలు కూడా నిండకుండానే నవ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. నిండు చూలాలు 6 నెలల గర్బవతి మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మ నిచ్చే భార్య విగత జీవిగా మారింది.. ఈ విషాద ఘటన విశాఖలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. అక్కయపాలెంకు చెందిన వాసుదేవ్, అనితలకు ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహం జరిగింది.. నిన్న రాత్రి ఏమైందో ఏమో ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. భర్త ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందగా, భార్య నేలపై అచేతనంగా పడి ఉంది.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసు గా నమోదు చేసినా దర్యాప్తు చేస్తున్నారు.. గర్భవతి అయిన భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్నారా? ఇంకా ఏదైనా కోణం ఉందా? మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, పెళ్లి జరిగి ఏడాది కూడా తిరగకుండా.. అది కూడా నిండి గర్భిణిగా ఉన్న మహిళ, ఆమె భర్త ఒకే సారి చనిపోడం.. విశాఖలో కలకలం రేపుతోంది..

Read Also: Chevella Bus Accident: ఇద్దరు పిల్లలను అనాథలను చేసిన చేవెళ్ల బస్సు ప్రమాదం

Exit mobile version