Site icon NTV Telugu

Police Ride: గోవాలో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన ప్రముఖ టీవీ నటి

tv actress

tv actress

అవకాశాలు లేక, డబ్బుల కోసం పలువురు హీరోయిన్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బుల కోసం వ్యభిచార కూపంలోకి చొరబడుతున్నారు. చివరికి ఇలా పోలీసుల చేతికి చిక్కి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా గోవాలో ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార దందా నడుపుతున్నాడని, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పక్కా సమాచారం రావడంతో గోవా పోలీసులు అతడు ఉంటున్న హోటల్ ని రైడ్ చేశారు. ఈ రైడ్ లో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.

ముగ్గురు మహిళల్లో ఒకరు టీవీ నటి కావడం గమనార్హం. బెంగాలీ, మరాఠీ భాషల్లో కనిపించే ఆమె వ్యభిచారం చేస్తూ దొరకడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో ఇద్దరిలో ఒక మహిళ ముంబై సమీపంలోని విరార్‌కు చెందిన వారు కాగా.. మూడో మహిళను హైదరాబాద్‌కు చెందినట్టు నిర్ధారించారు. కాగా .. తనను అలావంతంగా ఇక్కడికి తీసుకొచ్చారని, తనకు ఇష్టంలేకుండా ఈ రొంపిలోకి దింపారని, వారు చెప్పిన పని చేయకపోతే చంపేస్తామని బెదిరించారని సదరు టీవీ నటి చెప్పడం గమనార్హం.

Exit mobile version