రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నారులని కూడా చూడకుండా కామాంధులు చిదిమేస్తున్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నామన్న విచక్షణ మరిచి కామంతో రగిలిపోతూ ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్, మైనర్ బాలికను వేధించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. చిట్టమూరులో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఒక కుటుంబం తమ సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ కుటుంబం చెప్పిన వివరాలను రాసుకున్న పోలీసులు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ ని మరిన్ని వివరాలు తెలుసుకురమ్మని వారి బాధితుల ఇంటికి పంపారు. ఇక ఇటీవల బాధితుల ఇంటికి వెళ్లిన సుధాకర్ ఇంట్లో మైనర్ బాలిక ఒక్కత్తే ఉండడం గమనించాడు. బాలికను ఒడిలో కుర్చోబెట్టుకొని వివరాలను సేకరిస్తున్నట్లు మాయమాటలు చెప్పి ఆమెను టచ్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రైవేట్ భాగాలపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక కేకలు వేసింది. దీంతో బాలికను పక్కకు నెట్టి అతను పరారయ్యాడు. ఇక బాలిక ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్‌ని అదుపులోకి తీసుకుని ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
