NTV Telugu Site icon

Noida: నడిరోడ్డుపై మహిళపై దాడి.. వీడియో వైరల్.. నిందితుడు అరెస్ట్

Noida

Noida

గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దాడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమెను దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఓమాక్స్ పామ్ గ్రీన్ సొసైటీలో ఓ మహిళపై సూర్య భదానా అనే వ్యక్తి భౌతికదాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరికీ గతం నుంచి పరిచయం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సూర్య, బాధితురాలు ఒకే కాలేజీలో చదువుతుండడంతో ఒకరికొకరు ముందే తెలుసు అని చెప్పారు. అయితే దాడి చేస్తు్న్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ విడిపించుకోలేకపోయింది. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు వచ్చి విడిపించారు. అనంతరం ఇద్దరు వెళ్లిపోయారు. అయితే ఈ దాడికి ఎందుకు జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lokesh Kanagaraj: కూలీ, లియో 2 అప్‌డేట్‌లు ఇచ్చిన లోకేష్ .. మాస్ లోడింగ్!

Show comments