NTV Telugu Site icon

Crime : నదీమ్ హత్య కేసును చేదించిన పటాన్ చెరు పోలీసులు

Untitled 12

Untitled 12

Sangareddy: టీ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకి వెళ్లిన నదీమ్ తాహెర్ ఎంతకి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కాల్ తియ్యలేదు. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తారీకున సంగారెడ్డి జిల్లా లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహం నదీమ్ తాహెర్ గా స్పష్టం చేసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నదీమ్ తండ్రి అబ్దుల్ ఖయ్యూమ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా తాజాగా ఈ కేసుని చేధించిన పటాన్ చెరు పోలీసులు ప్రెస్ మీట్ లో హత్యకుగల కారణాలను వెల్లడించారు.

Read also:Crime: రోడ్డు పై రెచ్చిపోయిన బాబులు.. భయంతో పరులుగు తీసిన స్థానికులు

పోలీసుల సమాచారం ప్రకారం.. నదీమ్ చార్మినార్ మొఘల్ పురకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. దీనితో నదీమ్ పైన కక్ష పెంచుకున్న ఆమె భర్త షహబాజ్ నవాజ్.. నదీమ్ భైంసా నుంచి టోలిచౌకి వచ్చాడని తెలుసుకున్నాడు. అనంతరం మాట్లాడుకుందాం రమ్మని నదీమ్ ను పిలిచాడు. పథకం ప్రకారం నదీమ్ ను రప్పించిన షహబాజ్ నవాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది అని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం షహబాజ్ నవాజ్ ను అతనికి సంహరించిన షబ్బీర్ అహ్మద్, అజాజ్ అలీను అరెస్ట్ చేయగా మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.

Show comments