Crime: దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ, కఠినమైన అత్యాచార చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు భయపడటం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో చాలా వరకు వారికి తెలిసిన వ్యక్తుల నుంచే అఘాయిత్యాలకు గురవుతున్నారు.
Read Also: Mamata Banerjee: ఎగ్జిట్ పోల్స్‌ని అంగీకరించేదే లేదు.. ధైర్యంగా ఉండాలన్న మమతా బెనర్జీ..
ఇదిలా ఉంటే, ఒడిశాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని కులియానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో శనివారం జరిగింది. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. నిందితుడిని రమేష్ చంద్ర దేహురి(23)గా గుర్తించారు. బాలిక ఇతడికి మేనకోడలు అవుతుంది.
Read Also: Pema Khandu: “సూర్యుడు ఉదయించే రాష్ట్రం”లో కమలాన్ని వికసింపచేశాడు..
మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తరువాత, వారు ఒక ఒంటరి ప్రదేశంలో బాలిక యొక్క నగ్న శరీరాన్ని గుర్తించారు. బాలిక ఆ ప్రదేశానికి ఎలా చేరుకోగలదని వారు ఆరా తీస్తే, దేహూరి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లడం చూసినట్లు గ్రామస్థులు చెప్పారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. IPC సెక్షన్లు 376AB (అత్యాచారం) మరియు 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.