Site icon NTV Telugu

pistols and ganja seized: పిస్టళ్లు, రివాల్వర్లతో పట్టుబడ్డ స్మగ్లర్లు.. రూ.53 లక్షల గంజాయి సీజ్

11

11

pistols and ganja seized: గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు వైల్డ్‌గా మారుతున్నారు. తమ దందాను అడ్డుకున్నా.. ఎవరైనా అడ్డు వచ్చినా.. అక్కడికక్కడే చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇందుకోసం ఏకంగా మారణాయుధాలు పెట్టుకుని మరీ దందా సాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఒకప్పుడు రెడ్ శాండిల్ స్మగ్లర్లు… పోలీసులు దాడి చేసే సమయంలో తమ దగ్గర ఉన్న గొడ్డళ్లు.. రాళ్లు ఆయుధాలుగా వాడేవారు. ఇప్పుడు కాల క్రమంలో పిస్టళ్లు, నాటు తుపాకులు సైతం ఉపయోగిస్తున్నారు. ఇక గంజాయి స్మగ్లర్లు సైతం.. అదే తరహాలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఎవరైనా అడ్డం వస్తే చంపేయాలనే ప్లాన్‌తో వెళ్తున్నారు..

READ ALSO: Young Woman Suicide: పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో..

గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా తుపాకులే వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కేరళకు గంజాయి తీసుకు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ఐచర్ వ్యాను ద్వారా తరలిస్తున్న గంజాయి ముఠాను ఖమ్మం జిల్లా పాల్వంచలో పట్టుకున్నారు. ఆ ముఠా నుంచి క్వింటాల్ వరకు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 53 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు ఐతే వ్యాన్‌లో సోదాలు చేయగా.. 5 పిస్టళ్లు, ఒక రివాల్వర్, 40 బుల్లెట్స్‌తోపాటు 12 ఖాళీ మ్యాగజిన్స్ లభ్యమయ్యాయి..

బిలాల్‌పై ఇప్పటికే 100కు పైగా కేసులు
నిన్న మొన్నటి వరకు కత్తులను మారణాయుధాలుగా పెట్టుకుని గంజాయి స్మగ్లర్లు పట్టుబడే వారు. కానీ ఇప్పుడు ఏకంగా పిస్టళ్లు, రివాల్వర్లతో పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఐతే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మారణాయుధాలు కొనుగోలు చేసి.. అటు నుంచి అటే ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి కేరళకు వెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో బిలాల్‌, శ్యామ్‌ సుందర్‌, కాశీనందన్‌, సంతోష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుచ్చికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కేసులో పట్టుబడ్డ బిలాల్‌పై ఇప్పటికే 100కు పైగా కేసులు ఉన్నాయి. 28 సార్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన బిలాల్.. మళ్లీ నేరాలు చేస్తూనే ఉన్నాడు. అంతే కాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. ఈ మధ్యే 8 ఏళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చాడంటున్నారు పోలీసులు. ఇక తమిళనాడుకు చెందిన శ్యామ్‌ సుందర్‌ గంజాయి వ్యాపారంలో అరితేరిన వ్యక్తిగా పేరుగాంచాడని చెబుతున్నారు.

READ ALSO: Chitradurga murder case: డెత్ మిస్టరీ.. చిత్రదుర్గ్‌లో గండికోట తరహా కేసు

Exit mobile version