Site icon NTV Telugu

crime:దారుణం.. కడుపులో బిడ్డను మారుస్తానని.. మేకుతో అక్కడ కొట్టి..

crime news

crime news

కంప్యూటర్ యుగం.. ప్రపంచం మొత్తం డిజిటల్ గా దూసుకుపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలను నమ్మే వారు మాత్రం ఇంకా లగే ఉంటున్నారు. వీరి వలనే దొంగ బాబాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజగా ఒక మహిళ తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకొంది. ముగ్గురు ఆడపిల్లలు.. నాలుగోసారి కూడా ఆడబిడ్డ పుడితే పుట్టింటికి పంపించేస్తానన్న భర్త.. దీంతో ఆమె కాలు నిలవలేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, భయం. ఎక్కడ తన భర్త తనను వదిలేస్తాడో .. నలుగురు పిల్లలతో తన జీవితం ఏంటో అని.. ఆ భయమే కడుపులో ఏ బిడ్డ పెరుగుతుందో తెలుసుకునేలా చేసింది. కానీ ఎలా హాస్పిటల్ కి వెళితే చూడరు. దీంతో ఆమె ఒక బాబాను ఆశ్రయించింది. అతడికి సమస్య చెప్పింది. ఇందుకేముంది దొరికిందే ఛాన్స్ అనుకున్న ఆ దొంగ బాబా లేనిపోని మంత్రాలూ చదివి ఒక సాహసం చేయాలనీ చెప్పాడు. భర్తకోసం దానికి కూడా ఒప్పుకొని ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పై ప్రాణాలతో పోరాడుతుంది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ కి చెందిన ఒక మహిళకు ముగ్గురు ఆడపిల్లలు.. నాలుగోసారి కూడా ఆడపిల్ల పుడితే భర్త వదిలేస్తానని చెప్పడంతో ఆమె ఒక దారుణ నిర్ణయం తీసుకుంది. ఒక బాబాను కలిసి విషయం చెప్పింది. ఆ దొంగ బాబా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని కడుపులో ఆడబిడ్డను మగబిడ్డగా మారుస్తాను.. దానికి నీ తలపై నుంచి మేకును కొట్టించుకోవాలి అని చెప్పాడు. అయినా ఆ మహిళ భయపడలేదు. భర్త ఎక్కడ తనను పంపించేస్తాడేమో అన్న భయంతో ఆ దారుణానికి ఒప్పుకొంది. దీంతో దొంగబాబా ఆమెను ఒక చోట కూర్చోబెట్టి ఏవేవో మంత్రాలు చదివి ఆమె తలపై గట్టిగా మేకును దించాడు. ఆ మీకు తలభాగంలోకి చొచ్చుకుపోయి మహిళ స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక జరిగిన విషయం విని డాక్టర్స్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగబాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version