NTV Telugu Site icon

Madhya Pradesh: గర్ల్‌ఫ్రెండ్స్‌తో పిక్నిక్ వెళ్లిన ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. ఒకరిపై అత్యాచారం..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బుధవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఇద్దరు యువ ఆర్మీ అధికారు విహారయాత్రకు వెళ్లారు. అయితే, నేరస్తులు ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, అందులో ఒక మహిళపై అత్యాచారం చేశారు. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో యంగ్ ఆఫీసర్స్(వైఓ) కోర్సు చదువుతున్న 23, 24 ఏళ్ల అధికారులు తమ గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్ కోసం వెళ్లినప్పుడు ఘటన జరిగినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు.

Read Also: Devara Censor Report: దేవర మూవీ సెన్సార్‌ రిపోర్ట్.. సినిమా రన్‌టైమ్‌ ఎంతో చూడండి?

బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మోవ్-మండలేశ్వర్ రహదారిలోని పిక్నిక్ స్పాట్ సమీపంలోకి వచ్చిన ఏడుగురు గుర్తుతెలియని దుండగులు కారులో ఉన్న అధికారులలో ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని కొట్టడం ప్రారంభించారు. కారు నుంచి దూరంగా ఉన్న రెండో అధికారి సంఘటన గురించి సీనియర్ అధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నట్లు హిరోర్ తెలిపారు. పోలీసులను చూసి నేరస్తులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పారు.

నలుగురు బాధితులను ఉదయం 6.30గంటలకు వైద్య పరీక్షల కోసం మోవ్ సివిల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. అధికారుల శరీరాలపై గాయాల ఆనవాళ్లు ఉండటంతో పాటు ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసినట్లు తేలింది. ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ విలేకరులతో మాట్లాడుతూ.. దోపిడి, అత్యాచారం, ఆయుధాల చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నాలుగు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.

Show comments