Site icon NTV Telugu

Hyderabad: వాట్సాప్‌లో న్యూడ్ చాటింగ్.. యువతిపై అత్యాచారం

హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అయితే న్యూడ్‌గా చాటింగ్ చేయమని సదరు యువతిని యువకుడు కోరాడు. అతడి మాటల మత్తుకు పడిపోయిన యువతి న్యూడ్ చాటింగ్ చేసింది. కానీ కంత్రిగాడు న్యూడ్ ఛాటింగ్‌ను రికార్డు చేశాడు.

అనంతరం న్యూడ్ ఛాటింగ్‌ రికార్డును అడ్డం పెట్టుకుని యువతిని సదరు యువకుడు బెదిరింపులకు గురిచేశాడు. న్యూడ్ చాటింగ్ డిలీట్ చేయాలంటే రాజేంద్రనగర్‌లోని తన స్నేహితుడి గదికి రావాలని యువకుడు ఆంక్షలు విధించాడు. ఈ నేపథ్యంలో యువతిని బెదిరించి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా యువతి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడ్డ యువకుడితో పాటు మరో నలుగురిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version