Special Story: తల్లికి నచ్చని కూతురి లవర్.. 25 ఏండ్లు బందీ చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ అనేది రెండు అక్షరాలు. కానీ ఈ ప్రేమలో అనేక చరిత్రలు ఉన్నాయి. ఈ ప్రేమ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు. మరొకొందరైతే ప్రాణాలు తీశారు. ఇంకొందరి ప్రేమలు మధ్యలోనే మసకబారిపోయాయి. దానికి కారణం వారి కుటుంబ సభ్యులె. పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఎవరైనా సరే చాలావరకు అంగీకరించరు. ఒకవేళ అంగీకారం తెలిపిన ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని దాటితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది. లేదంటే మధ్యలోనే మసకబారిపోతుంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించక పోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ప్రేమించిన పాపానికి ఓ యువతిని 25 సంవత్సరాలు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి. ఈ విషాద ఘటన ఏమిటో తెలుసుకుందామా..?
ప్రేమల్లో వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంవల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఆడపిల్లల విషయంలో అయితే మరి ఎక్కువగా నిబంధనలు పెట్టి ఉంచుతారు. అయితే ఆ యువతి ఒక వ్యక్తిని ప్రేమించినందుకు 25 సంవత్సరాలు తను ఒక రూములో బందీగా చేసింది ఆమె తల్లి. ఇది మానవ చరిత్రలోనే చాలా విషాదకరమైన ఘటనలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఘటన గురించి వింటే నే కన్నీరు వస్తుంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది అయితే కాదు. 19వ శతాబ్దంలో ఫ్రాన్సు దేశంలో జరిగినది..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
వివరాల్లోకి వెళితే 1876 లో ఫ్రాన్సు దేశంలో ప్లాన్ బ్లాంచే నియర్ అనే యువతి ఒక యువకుని ప్రేమించింది. అప్పుడు ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ప్రేమించిన టువంటి వ్యక్తి ఆమె తల్లికి నచ్చలేదు. దీంతో తన కూతురు ప్రేమను అంగీకరించలేదు. అంతే కాకుండా మరొక వ్యక్తితో ఆమెను వివాహం చేయాలనుకుంది. దీంతో సదరు యువతి నిరాకరించింది. తనకు ప్రేమించిన వ్యక్తి కావాలని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ తల్లి తన కొడుకు సహాయముతో ఆ యువతిని చీకటి గదిలో బందీ చేసింది. గొలుసులతో కట్టింది. ఆమె చేసిన చిత్రహింసలు తట్టుకోలేక ఆ యువతి ప్రతిరోజు రోదించేది.
ఆ శబ్దాలను విన్నటువంటి బయటి వ్యక్తులు ఆమె తల్లిని ఆరా తీయగా తన కూతురుకు పిచ్చి లేసిందని చెప్పేది. దీంతో బ్లాంచే 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ చీకటి గదిలో బందీగా ఉంది. ఆ యువతికి వారి ఇంట్లో ఒక పని వ్యక్తి ప్రతిరోజు ఆహారాన్ని అందించేవాడు. ఆమెను గొలుసుతో కట్టి పడేయడం వలన ఆయువతి మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేది. దీంతో ఎంతో దౌర్భాగ్యమైన జీవితాన్ని ఆయువతి అనుభవించింది.
చివరికి ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఆ యువతిని చూసి నిర్ఘంతపోయారు. చూడని పరిస్థితి, మాటలు రావడంలేదు, నడవడం లేదు. గది అంతా దుర్వాసన. లోపలికి వెళ్లడానికే పోలీసులు భయం వేసింది. గది అంతా పురుగులతో నిండిపోయి వుంది. పోలీసులు ఆయువతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆమె తల్లిని, సోదరుని అరెస్టు చేశారు. ఈ దారుణమైన సంఘటన ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీంతో సదరు తల్లిని ప్రపంచమంతా అసహ్యించుకుంటుంది. తర్వాత సదరు యువతి 12 ఏళ్ళు బతికి మరణించింది.
Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..