శృంగారానికి వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సులో వారికైనా కోరికలు ఉండడం సహజమే. 80 ఏళ్ళ వయస్సులోను ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొని సంతృప్తిపొందేవారు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక 80 ఏళ్ల వ్యక్తి కూడా తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె సరే అనడంతో తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చి తనకు శృంగారం వద్దని, ఈసారి ఎప్పుడైనా చూద్దామని చెప్పి పడుకొంది . దీంతో రగిలిపోయిన ఆ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఇటలీలో ఎలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఇటలీలో 80 ఏళ్ల విటో భార్య నటాలియా(60)తో కలిసి నివసిస్తున్నాడు. ఇక ఇటీవల క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరుపుకున్న వీటో పండగ వేళ భార్యతో శృంగారం చేయాలనుకున్నాడు. అదే విషయాన్నీ భార్యకు చెప్పాడు. ఆమె కూడా సరే అనడంతో విటో ఆనందపడిపోయాడు. 80 ఏళ్ల వయస్సులో తన కోరికను తీర్చుకోవడానికి సామర్ధ్యం సరిపోదేమో అని అనుకోని శృంగార సామర్ధ్యం పెంచే వయాగ్రా ట్యాబ్లేట్స్ వేసుకొని మానసికంగా, శారీరికంగా సిద్దమై భార్యకు ఎదురుచూశాడు.
భార్య రాగానే కౌగిలించుకోగా ఆమె అతడిని పక్కకు నెట్టి .. ఇప్పుడు కాదు తరువాత అని చెప్పి పడుకొంది. దీంతో కోపాద్రిక్తుడైన విటో.. పక్కనే ఉన్న కత్తి తీసుకొని భార్యను హతమార్చాడు. అనంతరం ఏమి ఎరగని వాడిలానే రెండు రోజులు అలాగే బయట తిరిగాడు. భార్యను హత్య చేసినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. దీంతో వారు విటో ఇంటికి వచ్చి చూడగా నటాలియా మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారించగా.. వయాగ్రా వేసుకున్నాను.. శృంగారానికి ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాను అని చెప్పుకొచ్చాడు. అతడి మాటలకు షాక్ అవ్వడం పోలీసుల వంతు అయ్యింది.
