Site icon NTV Telugu

Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో లవర్స్ మృతదేహాలు.. అసలేం జరిగింది..

Crime

Crime

Valentine’s Day: ప్రేమికుల రోజు నాడు నోయిడాలో పార్క్ చేసిన కారులో ఒక జంట మృతదేహాలు కనిపించడం సంచలనంగా మారింది. నోయిడా సెక్టార్ 39 సమీపంలో టాటా అల్ట్రోజ్ కారులో సుమిర్, రేఖ మృతదేహాలు కనిపించాయి. వీరి తలలపై తుపాకీ గాయాలు ఉన్నాయి. వీరిద్దరి మరణానికి ముందు ఏం జరిగిందో కనుగొనే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ‘‘ప్రేమ’’ వ్యవహారమే ఈ మరణాలకు కారణమని తేలింది.

Read Also: Mahashivratri 2026: మహాశివరాత్రి వేళ.. ఉపవాస సమయంలో ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలుసుకోండి..!

కార్ డ్రైవర్ సీట్‌లో కూర్చున్న సుమిత్ చేతిలో పిస్టల్ దొరికిందని పోలీసులు తెలిపారు. కారు లోపలి నుంచి లాక్ చేయబడి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో సుమిత్ మొదటగా రేఖను కాల్చి, ఆపై పిస్టల్‌తో తనను తాను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. కారులోనే బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు లభించాయి. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, ప్రేమలో విభేదాలే ఇందుకు కారణమని తెలిసింది.

రేఖ నోయిడా సెక్టార్ 58 నివాసి కాగా, సుమిత్ ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో నివసించాడు. ఇద్దరూ శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు. వీరి కుటుంబాలు మిస్సింగ్ కంప్లైంట్ చేశాయి. సుమిత్ వదిలిపెట్టిన నోట్‌లో.. 15 ఏళ్లుగా తాను, రేఖ రిలేషన్‌లో ఉన్నామని, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చిందని చెప్పాడు. అయితే, రేఖ ఇప్పుడు వేరే వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది.

Exit mobile version