Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • పెళ్లి నెలలోనే నవ వధువు మృతి
  • భర్త వేధింపులపై కుటుంబ ఆరోపణలు
  • అత్తింటి టార్చర్‌తో కృంగిన అఖిల
  • అనుమానాస్పద మృతి.. పోలీసుల దర్యాప్తు
Nizamabad

Nizamabad

నిజామాబాద్ జిల్లాలో ఒక నవవధువు బలవన్మరణం చెందడం కలకలం సృష్టిస్తోంది. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆ యువతి తనువు చాలించింది. బాన్సువాడకు చెందిన అఖిల (బి.ఎస్సీ నర్సింగ్ విద్యార్థిని), ఆలూరు మండలం కల్లిడకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడితో మార్చి 5న వివాహం జరుపుకుంది. పెద్దల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పుట్టింటి వారు అడిగినంత కట్నకానుకలు సమర్పించారు. కానీ, అత్తారింట్లో ఆమె అడుగుపెట్టిన నాటి నుంచే నరకం మొదలయ్యిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

అఖిల ఆత్మహత్యకు భర్త శ్రీకాంత్ అసహజ శృంగార కోరికలే ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ నిరంతరం నీలి చిత్రాలు చూస్తూ, తనను కూడా ఆ తరహాలో ప్రవర్తించాలంటూ మానసికంగా, శారీరకంగా హింసించేవాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత పుట్టింటికి వచ్చిన సమయంలో అఖిల తన బాధను అక్క వద్ద మొరపెట్టుకుందని, భర్త వేధింపుల గురించి భయాందోళన వ్యక్తం చేసిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

కేవలం భర్త మాత్రమే కాకుండా, అత్త , ఆడబిడ్డ కూడా అఖిలను చిన్న చిన్న విషయాలకే వేధించేవారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతూ ఆమెను మానసికంగా కృంగదీశారని వారు పేర్కొన్నారు. పుట్టింటి నుండి అత్తారింటికి వచ్చిన రెండు రోజులకే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఖిల ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..

అఖిల మృతదేహంపై గీతలు, వాతలు ఉన్నాయని.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు వాదిస్తున్నారు. తన నర్సింగ్ వృత్తిలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆమె, తన ప్రాణాన్ని తీసుకునేలా భర్త ఎంతగా వేధించి ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడైన శ్రీకాంత్‌ను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మృగాళ్ల వల్ల మరే ఆడపిల్ల ప్రాణం పోకూడదని గ్రామస్థులు , బంధువులు డిమాండ్ చేస్తున్నారు.