Site icon NTV Telugu

Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!

Double Murde

Double Murde

ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా చావు కేకలు వినిపించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వివాహేతర సంబంధం చంపేసిందా…? పోలీసుల విచారణలో ఏం తేలింది..? నిందితులు ఎవరు..? నెల్లూరు జిల్లాలో జరిగిన జంట మర్డర్స్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా గండవరం పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పదునైన రాడ్‌లతో వారిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొడవలూరు మండలం పెద్దపుతేడుకు చెందిన కుందుర్తి వెంకటేష్, సంఘం మండలం వెంగారెడ్డిపాలానికి చెందిన బాల వెంకయ్యలు సమీప బంధువులు. గడ్డి మిషన్ కోసం డీజిల్ తీసుకెళ్తుండగా పక్కా స్కెచ్ వేసి.. గండవరం పొలాల దగ్గర నుంచి వడ్డీ పాలెం మెయిన్ రోడ్డుపై వెళుతున్న వారిద్దరని హత మార్చారు. తల మీద బలమైన గాయాలతో చెట్లలో పడిపోయిన వారిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు….

ముందు రోజు సాయంత్రం నుంచి ఇంటికి రాని ఇద్దరి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు… కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తమ వారిని గుర్తుపట్టి.. కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే వెంకటేష్‌కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని.. మహిళ బంధువు ఇటీవల కాలంలో వెంకటేష్‌ను బెదిరించారని.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారంగా.. పోలీసులు వేలిముద్రలు సేకరించారు…

జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ టార్గెట్‌గా నిందితులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు.. అడ్డొచ్చిన బాల వెంకయ్యను కూడా హత మార్చినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా స్కెచ్.. పక్కా ప్లాన్ వేసి.. మృతుల కదలికలను ముందే గమనించిన నిందితులు… నిర్మానుష్య ప్రాంతానికి రాగానే చంపేసినట్లు సీన్‌ను బట్టి అర్థం అవుతుంది. జంట హత్యలతో ఒక్కసారిగా గండవరం గ్రామం ఉలిక్కిపడింది….

ఐతే మృతుడు వెంకటేష్‌కు.. పెద్ద పుతేడ్ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల రెండు రోజుల క్రితం వెంకటేష్‌కు మహిళ బంధువులకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోని ముగ్గురు యువకులు వారిద్దరిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితులు బత్తల కళ్యాణ్‍‌తో పాటు ప్రశాంత్ విజయ్ భాస్కర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు..

 

Exit mobile version