Hubbali Incident: తనను తిరస్కరించిందనే కోపంతో పక్కింటి అమ్మాయి దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hubbali Incident:కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవల నేహ హిరేమత్ హత్యతో వార్తల్లో నిలిచిని కర్ణాటక హుబ్బళ్లిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంజలి అంబిగేరా(20) అనే యువతిని 21 ఏళ్ల గిరీష్ సావంత్ కిరాతకంగా పొడిచి చంపాడు. తెల్లవారుజామున అంజలి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిని గిరీష్ కత్తితో పదేపదే పొడిచి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోటీసులు గాలిస్తున్నారు.
Read Also: Amit Shah: కాశ్మీర్లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది.
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
గిరీష్ తనతో సంబంధం పెట్టుకోవాలని గత కొంత కాలంగా అంజలి వెంటపడుతున్నట్లు తెలిసింది. అయితే, అందుకు ఆమె తిరస్కరించడంతో ఆమెపై గిరీష్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరాపూర్ ఓని గ్రామంలో ఈ హత్య జరిగినట్లు హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ చీఫ్ గోపాల్ బయాకోడ్ తెలిపారు. నేరస్తుడిని పట్టుకునేందుకు ఓ పోలీస్ టీం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇటీవల 23 ఏళ్ల నేహా హిరేమత్ అనే యువతిని కాలేజ్ క్యాంపస్‌లోనే ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉన్నట్లు బీజేపీ ఆరోపించగా.. అధికార కాంగ్రెస్ మాత్రం ఇది వాళ్ల వ్యక్తిగత విషయం వల్ల జరిగిందని చెప్పింది. ఎన్నికల సమయంలో ఈ హత్య చర్చనీయాంశంగా మారింది. నేహా హిరేమత్ కూడా తన లవ్‌ని అంగీకరించడం లేదనే కోపంతోనే ఫయాజ్ ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!