Site icon NTV Telugu

Hubbali Incident: తనను తిరస్కరించిందనే కోపంతో పక్కింటి అమ్మాయి దారుణహత్య..

Karnatka

Karnatka

Hubbali Incident:కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవల నేహ హిరేమత్ హత్యతో వార్తల్లో నిలిచిని కర్ణాటక హుబ్బళ్లిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంజలి అంబిగేరా(20) అనే యువతిని 21 ఏళ్ల గిరీష్ సావంత్ కిరాతకంగా పొడిచి చంపాడు. తెల్లవారుజామున అంజలి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిని గిరీష్ కత్తితో పదేపదే పొడిచి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోటీసులు గాలిస్తున్నారు.

Read Also: Amit Shah: కాశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది.

గిరీష్ తనతో సంబంధం పెట్టుకోవాలని గత కొంత కాలంగా అంజలి వెంటపడుతున్నట్లు తెలిసింది. అయితే, అందుకు ఆమె తిరస్కరించడంతో ఆమెపై గిరీష్ కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరాపూర్ ఓని గ్రామంలో ఈ హత్య జరిగినట్లు హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ చీఫ్ గోపాల్ బయాకోడ్ తెలిపారు. నేరస్తుడిని పట్టుకునేందుకు ఓ పోలీస్ టీం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇటీవల 23 ఏళ్ల నేహా హిరేమత్ అనే యువతిని కాలేజ్ క్యాంపస్‌లోనే ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉన్నట్లు బీజేపీ ఆరోపించగా.. అధికార కాంగ్రెస్ మాత్రం ఇది వాళ్ల వ్యక్తిగత విషయం వల్ల జరిగిందని చెప్పింది. ఎన్నికల సమయంలో ఈ హత్య చర్చనీయాంశంగా మారింది. నేహా హిరేమత్ కూడా తన లవ్‌‌ని అంగీకరించడం లేదనే కోపంతోనే ఫయాజ్ ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Exit mobile version