NTV Telugu Site icon

Bengaluru: మహాలక్ష్మీ హత్య కేసులో నిందితుడు గుర్తింపు.. వీడుతున్న మిస్టరీ!

Bengaluruwomanmurdercase

Bengaluruwomanmurdercase

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనంగా మారింది. మహాలక్ష్మీని ముక్కలు.. ముక్కలుగా నరికి గదిలో రిఫ్రిజిరేటర్‌లో పెట్టడంతో దుర్వాసన వెదజల్లింది. దాదాపు 50 ముక్కలుగా నరికివేయబడింది. ఈ హత్య జరిగి 4-5 రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. దుర్వాసన రావడంతో ఇంటి యజమాని బంధువులను పిలిచి గది తలుపులు ఓపెన్ చేసి చూడగా ఫ్రిజ్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Snake bite: పాముకాటుతో యువకుడు మృతి.. అతని చితిపై పామును సజీవ దహనం

తాజాగా మహాలక్ష్మీ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లుగా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద సోమవారం తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉండగా వివరాలు వెల్లడించలేమన్నారు. దర్యాప్తునకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనుమానితుడు బెంగళూరు వాసి కాదని పేర్కొన్నారు. బయట వ్యక్తే నగరంలో ఉంటున్నట్లు వివరించారు.

బాధితురాలు మహాలక్ష్మీ.. మల్లేశ్వరంలోని ఓ మాల్‌లో పనిచేస్తోంది. భర్తకు దూరంగా ఉంటూ జీవిస్తోంది. ఒక వ్యక్తి రోజూ పికప్ చేసుకుని.. డ్రాప్ చేస్తాడని స్థానికులు తెలిపారు. అతడే ఈ హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించడానికి 4-5 రోజుల ముందు హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న భర్త కూడా సంఘటనాస్థలికి చేరుకున్నాడు. ఫ్రిజ్‌లో మహాలక్ష్మీ ఛిద్రమైన అవశేషాలు చూసి భయాందోళనతో కుటుంబ సభ్యులు పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి: Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!

పోలీసులు ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వెంటనే చుట్టుముట్టారు. సీనియర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదనపు పోలీసు కమిషనర్ (వెస్ట్ జోన్) ఎన్. సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో భద్రపరచడం చూశామన్నారు. ఇది 4-5 రోజుల క్రితం చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. బాధితురాలు.. భర్తకు విడివిడిగా జీవిస్తోందని సతీష్ కుమార్ తెలిపారు.

సంఘటనాస్థలి నుంచి మహాలక్ష్మి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలు స్వయంగా ఆఫ్ చేసిందా లేదా హత్య తర్వాత నిందితులు అలా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కాల్ రికార్డ్‌లు, సోషల్ మీడియా యాక్టివిటీ, వాట్సాప్ చాట్‌లను సమీక్షిస్తున్నారు. తదుపరి విశ్లేషణ కోసం పరికరాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపే యోచనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Laapataa Ladies: ఆస్కార్ రేసులో సూపర్ హిట్ మూవీ.. కథ అదిరిపోయింది.. చూశారా?

ఇక ఈ హత్యపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సోమవారం వివరాలు సేకరించింది. నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సమగ్రమైన, కాలపరిమితితో కూడిన విచారణ జరిగేలా చూడాలని కమిషన్ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. 3 రోజుల్లో వివరణాత్మక నివేదిక అందించాలని సూచించింది.

ఇది కూడా చదవండి: TS High Court: దుర్గం చెరువు పరిసర వాసులకు హైకోర్టు ఊరట.. కూల్చివేతలపై స్టే..