Navi Mumbai: మహారాష్ట్ర నవీ ముంబైలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల తన అక్కపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భాన్ని తీసేయించేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాలుడిపై వాషి పోలీసులు కేసు నమోదు చేశారు. వాషి జనరల్ హాస్పిటల్ నుండి మెడికో-లీగల్ కేసు (MLC) నివేదించబడిన తర్వాత శనివారం కేసు నమోదైంది. బాలిక ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అని పోలీసులు నిర్ధారించారు.
Read Also: Delhi: ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. చేతులు, కాళ్లు కట్టి యువకుడి నోటిలో మూత్ర విసర్జన
బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. డిసెంబర్ నెలలో అక్కాతమ్ములు పోర్న్ చూడటం ప్రారంభించారు. ఆ వీడియోల్లో చేసినట్లుగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అది కష్టం కావడంతో ఇద్దరూ విరమించుకున్నారు. అయితే, జనవరిలో బాలుడు, తన సోదరిని బలవంతం చేసి చర్యకు పాల్పడ్డాడని, ఆ తర్వాత తన పిరియడ్ మిస్ అయినట్లు బాలిక, తన తల్లితో వెల్లడించిందని, ఆ తర్వాత తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు.
పన్వేల్‌కి చెందిన ఈ కుటుంబం సొంతూరిలో ఉండగా ఈ ఘటన జరగడంతో అక్కడి ఖండేశ్వర్ పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు హౌస్ కీపింగ్ పనిచేస్తుంటారు. తండి నెలకు రూ.10,000 సంపాదిస్తే, తల్లి రూ. 8,000 వేలు సంపాదిస్తోంది. తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లిన సమయంలో బాలుడు అత్యాచారం చేసినట్లు తేలింది. ప్రస్తుతం బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ముందు హాజరుపరిచారు. బాలుడిపై పోక్సో, అత్యాచారం కేసులు నమోదయ్యాయి.