Nagpur: ప్రేమను తిరస్కరించిందుకు ఒక వ్యక్తి 23 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని హత్య చేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆమెను ఉరి వేశాడు. ముందుగా ఈ కేసును ఆత్మహత్యగా భావించిన పోలీసులు, విచారణ చేయగా పక్కింటి వ్యక్తి హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన బుధవారం నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు 38 ఏళ్ల వ్యక్తి శేఖర్ అజబ్రావ్ ధోరేను అరెస్ట్ చేశారు.
Read Also: YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!
షేర్ ట్రేడింగ్ కోచింగ్ తీసుకుంటున్న బీఏ విద్యార్థిని ప్రాచీ హేమరాజ్ బుధవారం తన బెడ్‌రూంలో ఉరి వేసుకుని కనిపించింది. ప్రాచీ తల్లి అందించిన సమాచారం ఆధారంగా మొదటగా పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. మొదట అంతా దీనిని ఆత్మహత్యగా భావించారు. అయితే, పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ప్రాచీ తలకు తీవ్ర గాయం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసిన హత్యగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులకు పక్కింటిలో ఉంటున్న శేఖర్ అజబ్రావ్ ధోరేపై అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం బయటపెట్టాడు. తన ప్రేమనున తిస్కరించడాన్ని తట్టుకోలేకనే ఆమెను చంపడానికి కుట్ర చేసినట్లు వెల్లడించాడు. సంఘటన జరిగిన రోజున ప్రాచీ తల్లిదండ్రులు, సోదరుడు పనికి వెళ్లినప్పుడు, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు నులిమి చంపేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత ఆమె తలను గోడకు కొట్టినట్లు వెల్లడించారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె స్కార్ఫ్ ను ఉపయోగించి ఉరితాడులా వేలాడదీసినట్లు చెప్పారు. పోలీసులు ప్రస్తుతం అధికారికంగా కేసును హత్యగా నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.
