NTV Telugu Site icon

Crime: తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. వాటర్ ట్యాంకులో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య

Suicide

Suicide

రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని కర్ణి కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. హజారీరామ్ (70), ఆయన భార్య చావ్లీ (68) ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబంలో విబేధాలు నెలకొనడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు దిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెండు రోజులుగా వృద్ధ దంపతులు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు కుమారుడికి సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు కొత్వాలి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా నీరు నిండిన ట్యాంక్ మూత తెరిచి ఉండడంతో అందులో ఇద్దరి మృతదేహాలు పడి ఉన్నాయి.

READ MORE: Archana Kochchar: ఫ్యాషన్ షోలో తుళ్లిపడ్డ అర్చన కొచ్చర్.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

ఈ కేసులో వెలుగులోకి వచ్చిన అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. హజారీరామ్ ఆత్మహత్యకు ముందు ఇంటి గోడలపై చాలా చోట్ల సూసైడ్ నోట్‌లు అతికించారు. పోలీసులు ఈ సూసైడ్ నోట్‌లను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. సూసైడ్ నోట్‌లో హజారీరామ్ తన కొడుకులు, వారి భార్యలు మరియు కొంతమంది బంధువులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ ఆస్తి తగాదాలు, ఇతర బంధువుల కారణంగా దంపతులు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు నోట్‌లో రాసి ఉంది. ఈ ఘటన తీవ్రతను గమనించిన ఎస్పీ నారాయణ్ తొగస్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను ట్యాంకు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

Show comments