Ayodhya: ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో నాగ సాధువును దారుణంగా గొంతు కోసి చంపారు. అయోద్యలోని హనుమాన్ గర్హి ఆలయ సముదాయంలో ఈ హత్య చోటు చేసుకుంది. గురువారం నాడు 44 ఏళ్ల నాగ సాధువు రామ్ సహరే దాస్ అనే వ్యక్తిని గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.బుధవారం సాయంత్రం మృతుడి శిష్యుడు దుర్బల్ దాస్ ఆశ్రయంలోకి వచ్చి చూడగా రామ్ సహరే దాస్ ప్రాణం పోయి కనిపించాడని పోలీసుల తెలిపారు. మృతుడి గొంతుపై లోతైన గాయాలు ఉన్నాయని పోలీసులు నిర్థారించారు.
Read Also: DK Shiva Kumar: డిప్యూటీ సీఎంకి హైకోర్టు షాక్.. సీబీఐ కేసుల కొట్టివేతకు తిరస్కరణ..
పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే, అదే కాంప్లెక్స్‌లో నివసిస్తున్న రిషబ్ శుక్లా కుమారుడు ఉమేష్ శుక్లా కోసం పోలీసులు వెతుకుతున్నారు. హత్యలో ఇతని ప్రయేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్లా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలు స్విచ్ఛాప్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హనుమాన్ గర్హి ప్రాంతంలో నెల రోజుల్లో ఇది రెండో ఘటన. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ నాగ సాధువు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా నిర్థారించలేదు. వ్యక్తిగత శతృత్వం, దోపిడి సహా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
