NTV Telugu Site icon

Mumbai : ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..

Mumbai Fire Accident

Mumbai Fire Accident

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్‌ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు..

ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ రోడ్డులోని జే భవానీ భవనంలో తెల్ల వారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 6:54 గంటలకు మంటలు ఆర్పివేయబడ్డాయి. గాయపడిన వారిలో 25 మంది హెచ్‌బిటి ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరో 15 మంది కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 18 మంది పురుషులు కాగా, వారిలో 22 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మంటలు చెలరేగడంతో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి. భవనంలో అగ్నిమాపక చర్యలు జరుగుతున్నట్లు ఒక వీడియో చూపించింది. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కింగ్ ఏరియాలో పడి ఉన్న గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.. మంటలు వ్యాపించడానికి అసలు కారణాలు ఏంటో పోలీసులు కనిపెట్టే పనిలో ఉన్నారు.. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Show comments