Mumbai: ఆస్పత్రిలో మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా ఫోన్‌లో షూట్.. నిందితుడు అరెస్ట్
- మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా ఫోన్‌లో రికార్డ్
- నిందితుడు అరెస్ట్.. ముంబై ఆస్పత్రిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఆస్పత్రిలో ఓ కార్మికుడు నీచానికి పాల్పడ్డాడు. మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా కిటికీలోంచి మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జయేష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: VIVINT PHARMA: తెలంగాణాలో కొత్తగా ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్.. భారీగా ఉద్యోగాలు..
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ముంబైలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్పత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా కార్మికుడిగా ఉన్న జయేష్ సోలంకి కిటికీలోంచి మొబైల్‌లో రికార్డ్ చేశాడు. డాక్టర్ గమనించి ఆస్పత్రిలోని సిబ్బందిని అలర్ట్ చేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిందితుడ్ని పట్టుకుని మొబైల్ చెక్ చేయగా వీడియో కనిపించింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన మంగళవారం (ఆగస్టు 6) జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు జయేష్ సోలంకి ఆస్పత్రిలో కాంట్రాక్టు కన్సర్వెన్సీగా పనిచేస్తున్నాడు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మహిళా వైద్యురాలు ఆస్పత్రిలోని రెస్ట్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేసిన జయేష్ సోలంకి అనే నిందితుడు మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా రహస్యంగా రికార్డు చేసినట్లు చెప్పారు. ఏదో అలికిడి జరగడంతో ఆమె అప్రమత్తం అయిందని తెలిపారు. నిందితుడ్ని ఆస్పత్రి సిబ్బంది పట్టుకున్నారని చెప్పారు. మొబైల్‌లో డాక్టర్ స్నానం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడు సోలంకి ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. వీడియో ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేశాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీయడం వెనుకు ఉద్దేశాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.
Mumbai: Police have arrested and registered a case against sanitary worker Jayesh Purushottam Solanki working at Kandivali's Government Hospital for making an obscene video of a female doctor while she was taking a bath in the restroom of the hospital. When she got suspicious she…
— ANI (@ANI) August 6, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!