NTV Telugu Site icon

Mother Sold Son : కొడుకును అమ్మేసి.. కిడ్నాప్ చేశారంటూ డ్రామా..

Mother Sold Son

Mother Sold Son

తల్లి అనే పదానికి మచ్చ తీసుకువచ్చిందో మహిళ.. కన్న కొడుకు డబ్బుల కోసం అమ్మేసి.. పైగా కిడ్నాప్‌ చేశారంటూ డ్రామాకు తేరలేపింది. ఈ నెల2 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లాలో కంది గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన వడ్డె శ్రీలత (32) తన భర్తకు దూరంగా తన మూడేళ్ల కొడుకుతో కలిసి ఉంటోంది. అయితే.. శ్రీలత ఈ నెల 1వ తేదీన తన మూడేళ్ల కొడుకును రోడ్డుపై కొడుతూ కనిపించింది. అయితే.. అదే సమయంలో అటుగా వెళ్తున్న అదే సమయంలో అటుగా వెళ్తున్న చెందిన హసన్ అనే మెకానిక్.. బాలుడిని ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించగా, నా కొడుకు..నా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది శ్రీలత. దీనికి.. నీకు ఇష్టం లేకుంటే ఎవరికైనా ఇచ్చేయ్.. అందుకు డబ్బులు ఇస్తారంటూ మెకానిక్ హసన్ వెల్లడించడంతో.. కొడుకును విక్రయించ డానికి సిద్ధమైంది శ్రీలత.

 

ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 2న జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైదరాబాద్ కు చెందిన మెకానిక్ హసన్ అతడి భార్య సనాబేగంలకు కొడుకును 30వేలకు శ్రీలత విక్రయించింది. ఈ వ్యవహారాన్నంతా మెకానిక్ హసన్ తన సెల్‌ఫోన్‌ వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఓ మెకానిక్ తనను కత్తితో బెదిరించి తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ సంగారెడ్డి రూరల్ పోలీసులకు శ్రీలత ఫిర్యాదు చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన సంగారెడ్డి రూరల్ పోలీసులు.. బృందాలతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ లో బాలుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వెంటనే మెకానిక్ దంపతులతో పాటు బాలుడిని శనివారం సంగారెడ్డికి తీసుకువచ్చారు. వడ్డె శ్రీలతను బెదిరించడం, బాలుడిని కిడ్నాప్ చేయడం అవాస్తవమని పోలీసుల నిర్దారణ వచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు శ్రీలతపై, బాలుడిని కొనుగోలు చేసినందుకు మెకానిక్ దంపతులు హసన్-సనాబేగంలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని సంగారెడ్డిలోని శిశుగృహకి తరలించారు పోలీసులు.