Crime News: అమ్మాయి పుట్టిందని దారుణం.. మైక్రోఓవెన్‌లో పెట్టి హత్య చేసిన కన్నతల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ దారుణంగా ప్రవర్తించింది. ఈ బిడ్డను హత్య చేసేందుకు వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది.
అంతలోనే ముసలావిడ అరుపులు విని ఇరుగుపొరుగు వారు వెంటనే వచ్చి వంట గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలకు వెళ్లి మైక్రోఓవెన్ తీసి చూడగా పాప చనిపోయి కనిపించింది. దీంతో ఈ ఘటనపై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా రెండు నెలల పసిపాపను కన్నతల్లే హత్య చేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలకు ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి ఘటనలు ఎదురవుతాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!