NTV Telugu Site icon

UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి

Water

Water

నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డల్ని ఓ కసాయి తల్లి అర్ధాంతరంగా కడతేర్చింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు నిండు నూరేళ్ల నిండిపోయేలా చేసింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో చోటుచేసుకుంది.

ఔరయ్యలోని బరావా గ్రామానికి చెందిన ప్రియాంకకు నలుగురు పిల్లలు. ఏడాదిన్నర క్రితం భర్త చనిపోయాడు. అనంతరం ఆమె తన దగ్గర బంధువుతో సహజీవనం చేస్తోంది. అయితే గురువారం ఉదయం ప్రియాంక తన పిల్లలను కేశంపూర్ ఘాట్ దగ్గర తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టి చంపి నదిలో పడేసింది. ఈ ఘటనలో 4, 5 ఏళ్ల పిల్లలిద్దరూ ఘాట్ దగ్గర శవాలుగా కనిపించారు.. మరో ఆరేళ్ల బాలుడు అదృష్టవశాత్తూ ఘటనాస్థలం నుంచి తప్పించుకుని సురక్షింగా బయటపడ్డాడు. మరో ఏడాదన్నర చిన్నారి మాత్రం కనిపించకుండాపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని నిందితురాలు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. తానే పిల్లలను చంపినట్లుగా నేరం అంగీకరించింది. పిల్లల్ని పోషించలేక.. బిడ్డల ఆకలి బాధ చూడలేక చంపేసినట్లు తెలిపింది. ఆమె మాటలు విన్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే ప్రియాంక భర్త చనిపోయాక.. దగ్గర బంధువుతో రిలేషన్ కొనసాగిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు నది ఒడ్డున విగతజీవులుగా పడి ఉన్న దృశ్యాలు మనసును కలిచి వేస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Show comments