NTV Telugu Site icon

Rayachoti Crime: పిల్లలతో సహా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లి.. ముగ్గురు సజీవదహనం..

Crime

Crime

Rayachoti Crime: అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురూ సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో రమా (35) తల్లి.. ఇద్దరు పిల్లలు మను (7 ఏళ్ల బాబు), మన్విత (ఐదేళ్ల పాప) ప్రాణాలు విడిచారు.. మంటల్లో కాలిపోయారు రమా, మను, మన్విత.. రాయచోటి కొత్తపేటలోని తొగటవీదిలో ఈ ఘటన జరిగింది.. అయితే, జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌కి వెళ్లారు మృతురాలి భర్త రాజా.. అయితే, ఏం సమస్య వచ్చిందో తెలియదు.. కానీ, ఈ రోజు తెల్లవారుజామున తన పిల్లలతో పాటు పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..

Read Also: LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌.. 25 లక్షల దరఖాస్తులు..!

ఇక, రాయచోటి పట్టణం కొత్తపేటలోని తొగటవీధిలో జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.. ప్రమాద ఘటనపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రి.. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను త్వరితగతిన గుర్తించాలని పోలీసులను ఆదేశించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కాగా, తన పిల్లలతో సహా రమా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది.

Show comments